Site icon NTV Telugu

లైంగికదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన మాజీ స్పీక‌ర్..

రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కొన్ని సందర్భాల్లో నోరు జారీ.. తమ తప్పును గ్రహించి క్షమాపణలు కోరిన సందర్భాలు చాలానే ఉంటాయి.. తాజాగా, కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేష్‌ కుమార్‌కు ఈ పరిస్థితి ఎదురైంది.. బుధవారం కర్ణాటక అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, దానికి స్పీకర్‌ అనుమతించలేదు.. ఈ సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ సభ్యుడు, మాజీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఒక సామేతను చెప్పుకొచ్చారు.. ‘ఒక సామెత ఉంది.. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, పడుకొని ఎంజాయ్‌ చేయాలి.. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే.. అంటూ కామెంట్‌ చేశారు రమేష్‌ కుమార్..

Read Also: పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. కేసీఆర్ ప్రకటన

అయితే, ఆయన కామెంట్లపై సభలోని ఏ ఒక్కరూ అభ్యంతరం తెలపలేదు.. కనీసం స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే కగేరి కూడా ఆ వ్యాఖ్యలను ఖండించకుండా పగలబడి నవ్వారు.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. ఇక, రమేష్‌ కుమార్‌ వ్యాఖ్యలపై తర్వాత దుమారమే రేగింది.. దీంతో.. సోషల్‌ మీడియా వేదికగా ఈ వ్యవహారం స్పందిచిన రమేష్‌ కుమార్‌.. ‘రేప్‌పై తాను చేసిన వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరిత, అసంబ‌ద్ధమైనవి.. చాలా హేయ‌మైన ఆ నేరం గురించి తానేమీ న‌వ్వులాట‌గా మాట్లాడ‌లేదు.. అనాలోచితంగా వ్యాఖ్యలు చేశా.. ఇక నుంచి తాను జాగ్రత్తగా మాట్లాడుతా అంటూ ట్వీట్‌ చేశారు రమేష్‌ కుమార్.

Exit mobile version