బోర్డర్‌లో నిత్యం పహారా కాసే సైనికులు కబడ్డీ అడుతూ కనిపించారు. భారత్, అమెరికా దేశాల సైనికులు యుద్ద్ అభ్యాస్ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని అలస్కాలో ఈ యుద్ద్ అభ్యాస్ విన్యాసాలు జరుగుతున్నాయి. అక్టోబర్15 నుంచి 29 వరకు ఈ విన్యాసాలు జురుగుతాయి. ఇండియా నుంచి 350 మంది, అమెరికా నుంచి 300 సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, వీరి మధ్య మంచి వాతావరణం నెలకొల్పేందుకు వివిధ రకాల క్రీఢలను ఏర్పాటు చేశారు. అందులో కబడ్డీ ఒకటి. రెండు దేశాల సైనికులు జట్లుగా విడిపోయి కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్ గేమ్స్ ఆడారు. అమెరికన్ సైన్యం కబడ్డీలో రాణించగా, ఇండియా సైన్యం ఫుట్‌బాల్‌లో రాణించింది.
Read: భారీ వర్షాల ఎఫెక్ట్: వరదల్లో కొట్టుకుపోయిన ఇల్లు…
