NTV Telugu Site icon

IPL: ముంబైకి షాక్‌.. రాజస్థాన్‌ గ్రాండ్‌ విక్టరీ

Rajasthan Royals

Rajasthan Royals

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 భాగంగా ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. జోస్ బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్‌కు 23 పరుగుల తేడాతో విజయం సాధించి పెట్టింది.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు వేగంగా నాలుగు వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన గెలుపు నమోదు చేసింది.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో ముంబైని పటిష్టమైన స్కోర్‌ వైపు నడిపించే ప్రయత్నం చేసినా.. నవదీప్ సైనీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌ చేరాడు కిషన్‌.. దీంతో ముంబై పరుగుల వరదకు బ్రేక్‌ పడింది.. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్‌ తొందరగా వికెట్లు సమర్పించుకోవడంతో ముంబై వెనుకబడి.. చివరికి, 23 పరుగుల తేడాతో ఓడిపోయింది..

Read Also: AP: సిద్ధమైన కొత్త జిల్లాల ఫైనల్ డ్రాఫ్ట్.. ఏ క్షణంలోనైనా గెజిట్..!

ఇక, తిలక్ వర్మ మరియు ఇషాన్ కిషన్ మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబై ఇండియన్స్‌ను నిలబెట్టారు. రోహిత్ శర్మ కేవలం 10 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. జోస్ బట్లర్ ముంబై ఇండియన్స్‌పై 68 బంతుల్లో 11 ఫోర్లు మరియు 5 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేసి, రాజస్థాన్ రాయల్స్‌కు 193 పరుగులను అందించడంలో కీలక భూమిక పోషించి.. విజయాన్ని అధించాడు.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్థాన్‌ 193 పరుగులు చేయగా.. ముంబై మాత్రం 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసింది.. ఇక, ఈ సీజన్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది ముంబై.