వీడని పీఆర్సీ పీటముడి.. వచ్చేవారం మరోసారి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పీఆర్సీపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. అమరావతిలోని సచివాలయంలో ముగిసింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వచ్చే వారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశం వుంది. ఆ తర్వాతే ఫిట్ మెంట్, ఇతర ఆర్థిక అంశాల పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా వుంటే
ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు.
మా 71 డిమాండ్ల పై అధికారులు చర్చించారు. ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల 1600 కోట్ల బిల్లులు విడుదల పై సానుకూలంగా స్పందించారు. మార్చి నెల లోపు బకాయిల చెల్లింపులు పూర్తి చేస్తాం అన్నారు. ఫిట్ మెంట్ పై అధికారులు ఇచ్చిన 14 శాతం ను మేము అంగీకరించటం లేదని మరోసారి చెప్పాం. అసలు ఈ నివేదికనే గుర్తించామని చెప్పాం. మేము ఉద్యోగుల పక్షాన ఉన్నాం అని సీఎస్ హామీ ఇచ్చారన్నారు బండి శ్రీనివాసరావు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ప్రత్యేకంగా 40 అంశాల పై స్పష్టంగా మా అభిప్రాయం చెప్పాం. సమావేశాల పేరుతో కాలాయాపన తప్ప మరో ప్రయోజనం లేదు. సజ్జల వ్యాఖ్యలతో ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు.స్పష్టత ఇవ్వకపోతే సమావేశంలో కొనసాగాల్సిన అవసరం లేదని సీఎస్ తో చెప్పాం. 14.28 శాతం తో ఫిట్ మెంట్ ఇస్తే ప్రతి ఉద్యోగి 4 నుంచి 10 వేల వరకు జీతం తగ్గుతుందని క్యాటగిరీల వారీగా సీఎస్ ముందు పెట్టాం. 28 శాతం ఫిట్ మెంట్ ఇస్తే 3 వేల ఒక వంద కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని చెప్పాం.
45 శాతం ఫిట్ మెంట్ ఇస్తే ప్రభుత్వం పై పడేది కేవలం 8 వేల కోట్లు మాత్రమే భారం వుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఒకేసారి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలని చెప్పాం. పెండింగ్ డీఏల విషయంలో స్ట్రగుల్ కమిటీ, ఉద్యోగుల నుంచి మా పై తీవ్ర ఒత్తిడి ఉంది. రేపు మూడు గంటలకు మరోసారి మా కార్యవర్గంతో సమావేశం అవుతున్నాం. ఆర్ధికేతర అంశాల పై సగానికి పైగా పరిష్కారం అయినట్లే. పీఆర్సీ ఫిట్ మెంట్, మానిటరీ బెనిఫిట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాతో సమానంగా ఒకే రోజు పీఆర్సీ ఇవ్వాలి అనే అంశాలను సీఎంతో సమావేశంలో డిమాండ్ చేస్తాం అన్నారు బొప్పరాజు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!