Site icon NTV Telugu

12-17 ఏళ్లవారికి సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌.. డీసీజీఐ ఆమోదం

Johnson and Johnson

Johnson and Johnson

కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. 18 ఏళ్లకు దిగువ వయస్సున్నవారిపై మాత్రం కొన్ని ట్రయల్స్‌ జరుగుతున్నాయి.. ఈ దశలో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్‌ ముందుంజలో ఉంది.. మరోవైపు.. పెద్దలకు సింగిల్‌ డోస్‌తో వ్యాక్సిన్‌ రూపొందించి పంపిణీ చేస్తోంది అమెరికా ఫార్మా దిగ్గజమైన జాన్సన్ అండ్ జాన్సన్.. ఇప్పటికే భారత్‌లో ఈ సంస్థ అత్యవసర వినియోగానికి చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించింది.. తాజాగా ఆ సంస్థ 12 నుంచి 17 ఏళ్ల వయస్సు పిల్లల కోసం తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు కూడా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం లభించింది. కౌమారదశ పిల్లలకు కొవిడ్ -19 కి వ్యతిరేకంగా సింగిల్ షాట్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ.. గతంలో దరఖాస్తు చేసుకోగా.. ఆ సంస్థ అభివృద్ధి చేసిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ మూడవదశలో కోవిడ్ పై 85 శాతం సామర్ధ్యం పనిచేస్తోందని తేలపడంతో.. ఈ నిర్ణయం తీసుఉఒంది డీసీజీఐ.

ఇక, ఈ సింగ్‌ డోస్‌ వ్యాక్సిన్ దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి చెప్పారు. కరోనా మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడటానికి కొవిడ్ -19 వ్యాక్సిన్ ముఖ్యమైన ముందడుగు అని జాన్సన్అండ్ జాన్సన్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.. 18 సంవత్సరాల వయస్సు లోపు వారికి కోవిడ్ ను నివారించడానికి భారత ప్రభుత్వం జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ -19 సింగిల్-డోస్ టీకా అత్యవసర వినియోగ అధికారాన్ని జారీ చేసినందుకు మేం సంతోషిస్తున్నాం అంటూ హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version