JEE Mains 2022: జేఈఈ మెయిన్ మరోసారి రీ షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేసింది ఎన్టీఏ… ఏప్రిల్‌లో జరగాల్సిన మొదటి విడత జేఈఈ మెయిన్… జూన్‌కి వాయిదా వేశారు.. జూన్ 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. ఇక, మేలో జరగాల్సిన రెండో విడత పరీక్షలు జులై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది.. ఇక, తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొన్నటితో ముగిసిపోగా… నిన్నటి నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది.
Read Also: AP: ఇవాళే కీలక భేటీ.. ఆ తర్వాత మంత్రులంతా రాజీనామా..
Also Read
అయితే, ఇతర పరీక్షలు కూడా జేఈఈ మెయిన్ సమయంలో ఉండడంతో.. కొంత ఆందోళన నెలకొంది.. దీనిపై ఎన్టీఏకు విజ్ఞప్తులు కూడా వెళ్లాయి.. ముఖ్యంగా.. సీబీఎస్‌ఈతో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, హయ్యర్ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్ తేదీలు కూడా ఉండడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.. ఈ నేపథ్యంలో ఎన్టీఏకు వినతులు వెల్లువెత్తాయి.. వాటికి పరిశీలించిన అధికారులు.. చివరకు పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!