NTV Telugu Site icon

Jawan: జవాన్ లో మెరిసిన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. ఏ పాత్ర అంటే?

Jawan

Jawan

బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జవాన్.. నయనతార హీరోయిన్ గా నటించింది.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించారు.. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మూవీ పై భారీ హైప్‌నే క్రియేట్ చేశాయి.

అలాగే పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు మరింత ఎక్కువే ఉన్నాయి. దర్శకుడు అట్లీతో పాటు సినిమాలో చాలామంది సౌత్ యాక్టర్స్ ఉండడంతో తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మరి నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి షో కే మంచి టాక్ ను అందుకోవడంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.. సినిమా కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో తెలుగు నటీనటులు కూడా నటించిన విషయం తెలిసిందే.. సీనియర్ నటుల మాట పక్కన పెడితే వెబ్ సీరిస్ చేస్తూ ఫెమస్ అయ్యి, తెలుగు బిగ్ బాస్ లో మెరిసిన సిరి హనుమంతు కూడా ఈ సినిమాలో కనిపించింది.. ఈ సినిమాలో ఒక షరుఖ్ పాత్ర జైలర్, జైలులో ఆయన సబర్దినేట్ పాత్రలో సిరి కనిపించింది.. ఇంత పెద్ద సినిమాలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు.. ఈ సినిమా తర్వాత సిరి ఫుల్ బిజీ అవుతుందని ఆమె అభిమానులు చెబుతున్నారు.. ఇక పఠాన్ కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది..

Show comments