Site icon NTV Telugu

అందుబాటులోకి ఎగిరే బైక్‌లు… కొనాలంటే…

రోజు రోజుకు న‌గ‌రాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్న‌ది.  పెట్రోట్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి.  దీంతో విద్యుత్ తో న‌డిచే కార్లు, బైకుల వినియోగం పెరిగింది.  ట్రాఫిక్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో ప్ర‌యాణాలు చేస్తున్నారు.  ఇక జ‌పాన్‌లో లోక‌ల్ రైళ్ల‌లో ప్ర‌యాణం చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది.   నిత్యం కిట‌కిట‌లాడుతుంటాయి. ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జ‌పాన్‌కు చెందిన స్టార్ట‌ప్ కంపెనీ ఏఎల్ఐ టెక్నాల‌జీస్ ఎగిరే బైక్‌ల‌ను త‌యారు చేసింది.  ఈ బైక్ విలువ 77.7 మిలియ‌న్ యెన్‌లుగా నిర్ణ‌యించింది.  అంటే సుమారు మ‌న క‌రెన్సీలో రూ.5.09 కోట్లు.  ఈ బైక్ గంట‌కు 100 కిలోమీట‌ర్ల వేగంతో గాల్లో 40 నిమిషాల‌పాటు ప్ర‌యాణం చేస్తుంది.  నాలుగు విద్యుత్ బ్యాట‌రీల స‌హాయంతో ఈ బైక్ ప్రయాణం చేస్తుంది. 

Read: శాస్త్ర‌వేత్త‌ల ఆందోళ‌న‌: మూడు ద‌శాబ్దాలుగా అదే ప‌రిస్థితి… ఇలానే కొన‌సాగితే…

Exit mobile version