ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో ఉద్యమం కూడా కొనసాగుతూనే ఉంది.. బీజేపీ మినహా ఏపీలోని అన్ని పక్షాలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగుతున్నాయి. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గళం వినిపిస్తున్నారు.. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఉక్కుపరిశ్రమ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆయన.. ఇప్పటికే ప్రత్యక్ష పోరాటానికి దిగారు.. అంతేకాదు.. విశాఖ ఉక్కు పరిరక్షణకై సోషల్ మీడియా వేదిక డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్నారు..
Read Also: ‘నగరి’లో గ్రూప్ వార్ పీక్స్‌కి..! జగనన్న బర్త్ డే ప్లేక్సీలోనూ రాజకీయం..!
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగంగా మరో ట్వీట్ చేశారు జనసేనాని.. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకోవాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్… విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగాలు చేస్తామన్న వైసీపీ ఎంపీలు.. ప్లకార్డులు పట్టుకుంటే చాలని.. ప్రాణత్యాగాలంత త్యాగాలు అక్కర్లేదు” అంటూ ఘాటుగా తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కాగా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
YSRCP MP లు,
— Pawan Kalyan (@PawanKalyan) December 20, 2021
కనీసం ప్లకార్డులు పట్టుకోండి,చాలు.
——————————————
విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ' వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు '.
అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ‘ప్లకార్డులు పట్టుకోండి,చాలు.’#Raise_Placards_YSRCP_MP