Site icon NTV Telugu

జగన్ గుడ్ న్యూస్…అర్హులై లబ్ధి పొందలేనివారికి సాయం!

ఏపీలో నవరత్నాల ద్వారా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారు అనేక మంది వున్నారు. వారిని దృష్టిలో వుంచుకుని లబ్ది చేయనున్నారు సీఎం జగన్ . అర్హులై పథకాలు పొందలేక పోతున్న వారి దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధం అయింది.

ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ 9,30,809 మంది అర్హులైన లబ్ధిదారులకు 703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి వివిధ పథకాల కింద జమ చేయనున్నారు సీఎం వైయస్‌.జగన్‌. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో నిధుల జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. అదనంగా 3,44,497 మందికి పెన్షన్‌ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు అందచేస్తారు.

1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు అందచేయనున్నారు. మొత్తంగా 18,48,596 మందికి ప్రయోజనాలు అందించనున్నారు సీఎం జగన్. సమాజంలో అందరికీ ప్రభుత్వం ద్వారా సాయం అందించాలని భావిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సంక్షేమ పథకాలు తేవాలని అధికార వైసీపీ భావిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు వున్నా ప్రతి నెల ఒకటవ తేదీన వివిధ వర్గాల వారికి క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తోంది ప్రభుత్వం. గ్రామ వాలంటీర్ల ద్వారా పథకాల ప్రయోజనాలు వారి చెంతకే అందిస్తోంది.

Exit mobile version