Site icon NTV Telugu

స్మార్ట్ ఫోన్ రంగంలోకి టెస్లా…

టెస్లా ఇప్పటి వ‌ర‌కు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ఉత్పత్తి చేస్తూ వ‌స్తున్న‌ది.  టెస్లా కంపెనీ ఎల‌క్ట్రిక్ కార్ల‌కు ఎంత డిమాండ్ ఉన్న‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  టెస్లా ల‌క్ష‌కోట్ల డాలర్ల కంపెనీగా అవ‌త‌రించింది. కాగా, టెస్లా కంపెనీ ఇప్పుడు మొబైల్ త‌యారీ రంగంలోకి కూడా ప్ర‌వేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  గ‌త కొన్ని నెల‌లుగా దీనిపై వార్త‌లు వ‌స్తున్నాయి.  అయితే, ఎల‌న్ మ‌స్క్ దీనిని ఖ‌రారు చేయ‌లేదు.  మోడ‌ల్ పైపీ పేరుతో స్మార్ట్ ఫోన్ల‌ను త‌యారు చేయ‌బోతున్నార‌ని చైనాకు చెందిన గిజ్‌చైనా వెల్ల‌డించింది.  

Read: హ‌ర్యానా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం: వ్యాక్సిన్ తీసుకోకుంటే రోడ్ల‌పైకి నో ఎంట్రీ…

ట్రిపుల్ కెమెరా ఉండే ఈ ఫోన్‌లో 108 ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంద‌ని, 6.5 ఇంచ్‌ల స్క్రీన్‌తో ఈ మొబైల్ ఫోన్ రానుంద‌ని నిపుణులు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.  స్నాప్ డ్రాగ‌న్ 898 ప్రాసెస‌ర్‌తో, 2 టిబి స్టోరేజీ కెపాసిటీ క‌లిగిన ఈ మొబైల్ ధ‌ర 800 డాల‌ర్ల నుంచి 1200 డాల‌ర్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.  అయితే, దీనికి సంబంధించి టెస్లా కంపెనీగాని, ఎల‌న్ మ‌స్క్ గాని ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డంతో ఇవ‌న్నీ ఊహాగానాలేనా లేదంటే మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన త‌రువాత స్పందిస్తారా అనే సందిగ్ద‌త నెల‌కొంది.  

Exit mobile version