Site icon NTV Telugu

ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్ఐవీ ల‌క్ష‌ణాలు…?

ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది.  డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్ల వేగంతో ఈ వేరియంట్ విస్త‌రిస్తోంది.  ఇలానే కొన‌సాగితే మ‌రికొన్ని రోజుల్లో ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను చుట్టేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.  ఈ స్థాయిలో కేసులు పెర‌గ‌డానికి కార‌ణాలు ఏంటి?  ఎందుకు కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి అనే విష‌యాల‌పై శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను సౌతాఫ్రికాలో గుర్తించారు.  ఒమిక్రాన్ వేరియంట్‌కు హెచ్ఐవీ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దిశ‌గా శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు సాగించారు.  

Read: మ‌య‌న్మార్‌లో దారుణం… విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు… 70 మంది గ‌ల్లంతు…

ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్ఐవీ మూలాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని, ఆ దిశ‌గా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  హెచ్ఐవీ సోకిన వారికి క‌రోనా సోక‌డం, ఆ త‌రువాత క‌రోనా వైర‌స్‌లో ఉత్ప‌రివ‌ర్త‌నాలు జ‌రిగి ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకు వచ్చి ఉండ‌వ‌చ్చిన పరిశోధ‌కులు చెబుతున్నారు.  హెచ్ఐవీ సోకిన వారిలో బ‌ల‌హీన‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఉంటుంది.  వారిలో ఈ వైర‌స్‌లు వేగంగా అభివృద్ధి చెందుతాయి.  ఉత్ప‌రివ‌ర్త‌నాలు జ‌రిగి కొత్త వేరియంట్‌లు పుట్టుకు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.  

Exit mobile version