Site icon NTV Telugu

అకూస్ కూట‌మిపై అగ్ర‌రాజ్యం క్లారిటీ…ఇండియా ఆ కూట‌మిలో చేరుతుందా?

ఇండో పసిఫిక్ తీరంలో చైనా ప్రాభ‌ల్యాన్ని త‌గ్గించేందుకు త‌క్ష‌ణ‌మే ఓ బ‌ల‌మైన కూట‌మి అవ‌స‌రం ఉంద‌ని భావించిన అగ్ర‌రాజ్యం అమెరికా అటు బ్రిట‌న్‌, ఆస్ట్రేలియాతో క‌లిసి అకూస్ కూట‌మిని ఏర్పాటు చేసింది.  ఈ కూటిమి ఏర్ప‌డ‌టం వ‌ల‌న గ‌తంలో ఫ్రాన్స్‌తో ఆస్ట్రేలియా 12 జ‌లాంత‌ర్గాముల కోసం చేసుకున్న ఒప్పందం వీగిపోయింది.  దీనికి బ‌దులుగా అమెరికా అస్ట్రేలియాకు అధునాత‌న‌మైన అణుజ‌లాంత్గాముల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంది.  దీనిపై ఆస్ట్రేలియా, అమెరికాపై ఫ్రాన్స్ మండిప‌డింది. ఇక ఇదిలా ఉంటే ఆసియాలో చైనా ప్రాభ‌ల్యం త‌గ్గించేందుకు ఇప్ప‌టికే అమెరికా, ఇండియా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా దేశాలు క‌లిసి క్వాడ్ దేశాలుగా ఏర్ప‌డ్డాయి.  కాగా, ఇప్పుడు భార‌త్ అకూస్ కూట‌మిలో చేరుతుందా అనే సందేహాలు క‌లుగుతున్నాయి.  దీనిపై అగ్ర‌రాజ్యం క్లారిటీ ఇచ్చింది.  అకూస్ కూట‌మిలో ఇండియా, జ‌పాన్ దేశాలు చేర‌టం లేద‌ని, ఆసియా దేశాల‌కు ఈ అకూస్ కూటమిలో ఉండ‌బోవ‌ని వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.  సెప్టెంబ‌ర్ 24 వ తేదీన క్వాడ్ దేశాల నేత‌లు న్యూయార్క్‌లో స‌మావేశం కాబోతున్నారు. 

Read: ఆ యూనివ‌ర్శిటీలో కొత్త సీఎం డ్యాన్స్‌…

Exit mobile version