Site icon NTV Telugu

‘మెజార్టీ’ లెక్కలు తేలుస్తున్న సీఎం జగన్?

cm-jagan

cm-jagan

నవ్యాంధ్రలో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీస్తుందనడానికి కిందటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లను సాధించి ఘనవిజయం సాధించింది.. వైసీపీకి ఈ గెలుపు చిరస్మరణీయమైన గుర్తుగా మిగిలిపోగా.. ప్రతిపక్షాలకు మాత్రం పీడకలను మిగిల్చాయి. నాడు మొదలైన వైసీపీ వేవ్ నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది.    

రెండున్నేళ్ల తర్వాత సీఎం జగన్మోహన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే కేబినేట్ కూర్పుపై కసరత్తులు చేస్తున్నారు. ఈ టీంతో ఆయన వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే ఆయన గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జగన్ వేవ్ లోనూ గతంలో స్పల్ప మెజార్టీతో బయటపడిన ఎమ్మెల్యేల లిస్టును జగన్ రెడీ చేస్తున్నారని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరికి టిక్కెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.  

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు జగన్ ఇమేజ్ బలంగా పని చేసింది. జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని జనం భావించటం, టీడీపీపై వ్యతిరేకత కలిసి రావడంతో ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. చాలా నియోజకవర్గాల్లో కేవలం జగన్ ఫొటోను చూసే జనాల ఓట్లు పడ్డాయి. అయితే అంతటీ వేవ్ లోనూ కొంతమంది ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోలోకి వెళ్లారనే టాక్ విన్పిస్తోంది. దీంతో నాటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ ఎన్నికల్లో ఎవరెవరికి అత్యధిక మెజార్టీ వచ్చాయి? ఎవరికీ సల్ప మెజార్టీ వచ్చాయనే లెక్కలు తీస్తున్నారట. జగన్ వేవ్ లోనూ స్వల్ప మెజార్టీ వచ్చిందంటే వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లేనని ఆయన భావిస్తున్నారు. దీంతో వారికి ఈసారి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగతోంది. టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల స్పల్ప మెజార్టీతో బయటపడిన వారిని ఈ లెక్కలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బలహీనమైన అభ్యర్థులపై కూడా స్పల్ప మెజార్టీతో గట్టెక్కిన నేతల జాబితాను సీఎం జగన్ తయారు చేయిస్తున్నారట.

ఈ జాబితాలో అనేక మంది సీనియర్ల పేర్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో బయటపడిన నేతల్లో మల్లాది విష్ణు, కిలారు రోశయ్య, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ తదితర నేతలు ఉన్నారు. వీరంతా కూడా వెయ్యి రెండువేల లోపు ఓట్లతోనే బయటికి పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈసారి వీరికి టిక్కెట్ ఇచ్చే అంశంపై జగన్ పునరాలోచిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి. ఈ పరిణామంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందనే టాక్ విన్పిస్తోంది.

Exit mobile version