Site icon NTV Telugu

పంజాబ్‌లో అమ‌రీంద‌ర్ పొత్తు… బీజేపీకి లాభిస్తుందా?

పంజాబ్ లో కొత్త పార్టీ అవ‌త‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త పార్టీ పెట్ట‌బోతున్నారు.  ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీలోని కొంత‌మంది నేత‌లు, ఎమ్మెల్యేలు త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్నారని, పార్టీని స్థాపించిన త‌రువాత వారంతా త‌మ‌తో క‌లిసి వ‌స్తార‌ని అమ‌రీంద‌ర్ సింగ్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, కేంద్రం తీసుకొచ్చిన రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్నారు.  ఈ నిర‌స‌న‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్త‌మ‌య్యాయి.  అమ‌రీంద‌ర్ సింగ్ పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రైతుల నిర‌స‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు.  కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కెప్టెన్, పార్టీని స్థాపించి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామ‌ని చెబుతున్నారు.  ఒక‌వేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది  బీజేపీకి ఎంత వ‌ర‌కు క‌లిసి వ‌స్తుంది?  కెప్టెన్ రాజ‌కీయ ప్ర‌స్థానానికి బీజేపీతో పొత్తు కొత్త ఉత్సాహం ఇస్తుందా?  రెండు పార్టీలు క‌లిసి అధికారంలోకి వ‌చ్చే అవకాశం ఉంటుందా?   కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆ పార్టీ దూకుడు ప్రారంభించింది.  ఆప్ సైతం పంజాప్ క‌న్నేయ‌డంతో ఆ పార్టీని ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా చూస్తోంది కాంగ్రెస్‌.  అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త‌పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని హ‌రీష్ రావ‌త్ పేర్కొన్నారు. 

Read: వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆ దారిగుండా అనుమ‌తి…

Exit mobile version