ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ ను మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు తేదీని పొడిగిస్తూ వచ్చిన ఇంటర్ బోర్డ్ తాజాగా ఈనెల 30 వరకు గడువును పొడిగించింది. ఇదే చివరి అవకాశం అని, మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు 30 వ తేదీలోగా అడ్మీషన్లు పొందాలని పేర్కొన్నది. ఇక, ఈ విద్యాసంవత్సంలో ఇంటర్‌లో 70 శాతం సిలబస్ మాత్రమే ఉండబోతున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.
Read: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
మొదటి, ద్వితీయ సంవత్సరం 70శాతం సిలబస్ నుంచే పరీక్షలు ఉంటాయని బోర్డ్ తెలియజేసింది. కోవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థల్లో భౌతిక తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డ్ తెలియజేసింది. ఇంటర్ బోర్డ్ సిలబస్‌కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోసం బోర్డ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఇంటర్ బోర్డ్ తెలియజేసింది.
