ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్‌ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్‌ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పెట్టుబడి దారులు ఆంధ్ర ప్రదేశ్ అంటే హడలిపోయే పరిస్థితులను జగన్‌ కల్పించారన్నారు.

అందరి ప్రజాభిప్రాయలు తీసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. న్యాయ వ్యవస్థను తప్పు దారి పట్టించే విషయం తప్ప మరొకటి కాదని విమర్శించారు. మూడు రోజులు కిందట నేను అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టం రద్దు చేయమని అడిగితే..వ్యవసాయ మంత్రి పేయిడ్ ఆర్టిస్టుల కోస మా అని అడిగారన్నారు. మంత్రి కనీసం రైతులు పై కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. విశాఖలోనైనా కార్యాలయాలు కట్టాలిగా ఇప్పటికే అమరావతిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు మొదలు పెట్టారు కనుక సీఎం జగన్ కొనసా గించకూడదు అనే ఆలోచనలో ఉన్నారని ఆయన మండి పడ్డారు. ఇది ముమ్మాటికి వైసీపీ పరువు కాపాడుకునే చర్యగా బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు.

Related Articles

Latest Articles