Site icon NTV Telugu

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారతజట్టు ప్రకటన

దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటిస్తోంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటున్న జట్టు ఆ తర్వాత మూడు వన్డేలను ఆడనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు భారత జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గాయం కారణంగా రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్‌కు వన్డే పగ్గాలను అప్పగించారు. బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, భువనేశ్వర్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్‌

కాగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 19న తొలి వన్డే, 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి. తొలి రెండు వన్డేలు పార్ల్ వేదికగా జరగనుండగా.. మూడో వన్డేను కేప్ టౌన్‌ వేదికగా ఇరు జట్లు ఆడనున్నాయి.

Exit mobile version