Site icon NTV Telugu

Bomb Threat: ఢిల్లీలో స్కూల్ కి బాంబు బెదిరింపు.. విద్యార్థుల్లో భయాందోళన

Indian School

Indian School

ఢిల్లీలోని ఓ స్కూల్‌ కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో దక్షిణ ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ విద్యార్థులను ఖాళీ చేయించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు.
Also Read:Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాదిక్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10:49 గంటలకు ఒక ఇమెయిల్ పంపించారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. దీంతో ఆందోళనకు గురయిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. స్కూల్ గేట్ వద్ద గుమిగూడారు.
Also Read:Firing At Punjab : పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు మృతి

కాగా, ఈ స్కూల్ కి బాంబు బెదిరింపు రావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం నవంబర్‌లో కూడా బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు ఇమెయిల్ పంపించాడు. అయితే, అది ఫేక్ ఇమెయిల్ గా పోలీసులు నిర్ధారించారు. తాజాగా మరోసారి అలాంటి ఇమెయిల్ రావడంతో కలకలం రేపింది. తమ బృందాలు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలంలో ఉన్నాయి అని సీనియర్ పోలీసు అధికారి చందన్ చౌదరి తెలిపారు. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేని చెప్పారు.

Exit mobile version