NTV Telugu Site icon

ముగిసిన మొదటి రోజు… సెంచరీతో ఆదుకున్న మయాంక్

భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు ప్రారంభం అయిన రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా కు మంచి ఆరంభం దొరికింది. కానీ ఓపెనర్ గిల్ (44) ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా డక్ ఔట్ కాగా ఆ వెంటనే కెప్టెన్ కోహ్లీ కూడా వివాదాస్పద రీతిలో ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. అయితే మొదటి టెస్ట్ లో రాణించిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ లో 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న ఓపెనర్ మాయక్ అగర్వాల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కీపర్ సాహాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలోనే తన 4వ సెంచరీ కూడా సాధించాడు మయాంక్. అనంతరం కూడా తొందరపడకుండా ఆట ముగిసే సమయం వరకు క్రీజులో ఉన్నాడు. ఇక మయాంక్ రాణించడంతో ఈ రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా 221/4 తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న మయాంక్(120), సాహా (25) రేపు మళ్ళీ ఆటను ప్రారంభిస్తారు.