Site icon NTV Telugu

India Overtakes China: భారత జనాభా 142.86 కోట్లు.. చైనాను అధిగమించి అగ్రస్థానం

Population

Population

ప్రపంచలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలిచింది. దేశ జనాభాలో చైనాను ఇండియా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి ఈరోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారతదేశ జనాభా 142.86 కోట్లు.
Also Read:Irrfan Khan: మహానటుడి చివరి హిందీ సినిమా రిలీజ్ అవుతోంది…

1950లో జనాభా వివరాలను సేకరించడం ప్రారంభించిన తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్‌లో కొంతమేరకు పెరిగింది కనిపిస్తోంది. భారతదేశం 2011 నుండి జనాభా గణనను నిర్వహించింది. దేశంలో దశాబ్దానికి ఒకసారి జనాభా గణన 2021లో జరగాల్సి ఉంది. కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. UN డేటా ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు 1/4 వంతు మంది 14 ఏళ్లలోపు వారు. జనాభాలో 68 శాతం మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్నవారు కాగా, 7 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు. 2023 మధ్య నాటికి ప్రపంచ జనాభా 8.045 బిలియన్లకు చేరుకుంటుందని కొత్త UN నివేదిక అంచనా వేసింది.

చైనా జనాభాలో 40 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. ఇక్కడ ఒకప్పుడు జనాభా నియంత్రణకు నిబంధనలు రూపొందించారు. అదే సంవత్సరంలో, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరమైన బీజింగ్‌లో జనాభా తగ్గుతోందని ఒక నివేదిక పేర్కొంది.

Exit mobile version