Site icon NTV Telugu

2050 నాటికి భార‌త్ అలా మార‌నుందా?

క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.  క‌రోనా కాలంలో నేర్చుకున్న గుణ‌పాఠాల‌తో భార‌త్ దిగుమ‌తుల‌ను వీలైనంత‌గా త‌గ్గించి మేడ్ ఇన్ ఇండియాపై దృష్టిపెట్టింది.  పెరుగుతున్న జ‌నాభాకు ఎంత మేడ్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తులు వ‌స్తున్న‌ప్ప‌టికీ డిమాండ్‌కు త‌గిన ఉత్ప‌త్తి మ‌న‌ద‌గ్గ‌ర లేదు.  దీంతో కొన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసుకొక త‌ప్ప‌దు.  ప్ర‌స్తుతం ఇండియా ప్ర‌పంచ దిగుమ‌తుల్లో 2.8 శాతం వాటాలో ఎనిమిదో స్థానంలో ఉన్న‌ది.  2030 నాటికి ఇది మ‌రింత పెరిగి 3.9 శాతం వాటాతో దిగుమ‌తుల్లో నాలుగో స్థానానికి చేరుకుంటుంద‌ని బ్రిట‌న్ అంత‌ర్జాతీయ వాణిజ్య శాఖ నివేదిక‌లో పేర్కొన్న‌ది.  ఇక 2050 నాటికి ఇండియా ప్ర‌పంచ దిగుమ‌తుల్లో 5.9 శాతం వాటాను ద‌క్కించుకొని చైనా, అమెరికా త‌రువాత మూడో స్థానంలో ఉంటుంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.  ఇండో పపిఫిక్ రీజియ‌న్‌లో పెరుగుతున్న జ‌నాభా కార‌ణంగా ఆ ప్రాంతాల్లో దిగుమ‌తులు పెరుగుతున్నాయ‌ని నివేదిక పేర్కొన్న‌ది.  ఇండియా దిగుమ‌తి రంగంతో పాటుగా మేడ్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తులు కూడా భారీగా పెరుగుతాయ‌ని, ర‌క్ష‌ణ రంగానికి చెందిన ఉత్ప‌త్తుల‌ను భార‌త్ వివిధ దేశాల‌కు ఎగుమ‌తి చేసే సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటుంద‌ని నివేదికలు తెలియ‌జేస్తున్నాయి.  

Read: య‌డ్యూర‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్యలు: గెల‌వ‌డానికి మోడీ వేవ్ ఒక్క‌టే స‌రిపోదు…

Exit mobile version