Site icon NTV Telugu

పంజాబ్‌లో ఎస్ 400 మోహ‌రింపు…

ర‌ష్యానుంచి ఎస్ 400 ట్యాంకుల‌ను భార‌త్ దిగుమ‌తి చేసుకున్న‌ది.  మూడేళ్ల క్రిత‌మే రెండు దేశాల మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది.  అన్ని ఆటంకాల‌ను దాటుకొని మొద‌టి బ్యాచ్ ఎస్ 400 ట్యాంకులు ఇండియాకు చేరుకున్నాయి.  ఎస్ 400 ట్ర‌యాంఫ్ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ‌శ్రేణి వ్య‌వ‌స్థ‌ను తొలి స్వాడ్ర‌న్‌ను పంజాబ్ సెక్టార్‌లో మోహ‌రిస్తున్నారు.  పాక్, చైనా దేశాల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధీటుగా వీటిని పంజాబ్ సెక్టార్‌లో మోహ‌రిస్తున్నారు.  

Read: వ‌చ్చే ఏడాది కూడా ఇంటినుంచే విధులు…

ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా ఆయుధాలు ర‌ష్యా, చైనా, ట‌ర్కీ దేశాల వ‌ద్ద మాత్ర‌మే ఉన్నాయి.  ఈ ర‌కం ఆయుధాలు క‌లిగిన నాలుగో దేశం ఇండియా అని చెప్పాలి.  నాటో దేశాల నుంచి ఎదుర‌య్యే ముప్పును ఎదుర్కొనేందుకు మ‌ల్టీసిస్టం ఆయుధాలుగా చెప్ప‌వ‌చ్చు.  2007లో దీనిని ర‌ష్యా ఆర్మీకి అందించింది.   

Exit mobile version