Site icon NTV Telugu

ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నా తీవ్ర‌త ఏమాత్రం తగ్గ‌లేదు.  క‌రోనా తీవ్ర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.  దేశంలో కొత్త‌గా 35,499 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,19,69,954కి చేరింది.  ఇందులో 3,11,39,457 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,02,188 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 447 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,28,309కి చేరింది.  థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌ప్ప‌ని స‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు రావొద్ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  

Read: హ్యాపీ యానివర్సరీ మై లవ్… రానాకు మిహిక విషెస్

Exit mobile version