Site icon NTV Telugu

భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..

COVID 19

COVID 19

భారత్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఇక, యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, శుక్రవారం దసరా పండగ కావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోయింది.. అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 9,23,003 శాంపిల్స్‌ పరీక్షించగా.. 15,981 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 116 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 17,861 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..

ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య.. 3,40,53,573కు పెరగగా… కోలుకున్నవారి సంఖ్య 3,33,99,961కు చేరింది.. మరోవైపు.. కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 4,51,980కు పెరగగా.. ప్రస్తుతం దేశంలో 2,01,632 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. శుక్రవారం ఒకేరోజు దేశ్యాప్తంగా 8.36 లక్షల మందికి టీకా పంపినీ చేయగా.. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 97,23,77,045కి పెరిగింది.. దసరా పండుగ నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు శుక్రవారం వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version