భారత్‌ కోవిడ్‌ అప్‌డేట్‌.. మళ్లీ పెరిగిన కేసులు..

India COVID 19

India COVID 19

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఐదు వేలకు పైగా కేసులు పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 282 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 31,990 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,01,604 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,28,15,731కు పెరగగా.. కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,46,050కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,38,205 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 83,39,90,049 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.