Site icon NTV Telugu

కొత్త రూల్‌: సీరియ‌ళ్ల‌లో కౌగిలింత‌లు క‌ట్‌…

టీవీలో ఒక సీరియ‌ల్ ప్ర‌సారం కావ‌డం మొద‌లుపెడితే నెల‌లు కాదు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి సాగుతుంటాయి. ఇక ఇప్పుడు వ‌స్తున్న సీరియ‌ళ్ళు కాస్త శృతిమించిపోతున్నాయి. సినిమాల్లో ఉన్న‌ట్టుగానే ప్రేమ‌లు, ముద్దులు వంటివి క‌నిపిస్తున్నాయి. సీరియ‌ళ్ల ప్ర‌భావం యువ‌త‌పైన‌, కుటుంబాల‌పైన అధికంగా ఉంటోంది. దీంతో పాక్ ప్ర‌భుత్వం ఈ సీరియ‌ళ్ల వ్య‌వ‌హారంపై దృష్టిసారించింది. టీవీ సీరియ‌ళ్ల‌లో ఇక నుంచి కౌగిలింత‌లు, ఇత‌ర‌త్రా స‌న్నిహిత దృశ్యాలు వంటివి ఉండ‌కూడ‌ద‌ని, అలాంటి వాటికి ప్ర‌సారం చేయ‌డం నిలిపివేయాల‌ని పీఈఎంఆర్ఏ టీవీ ఛాల‌ళ్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌జ‌ల నుంచి ఇలాంటి వాటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని, ఇలాంటి వాటి వ‌ల‌న దేశ సంస్కృతి చిన్నాభిన్నం అవుతుంద‌ని ఫిర్యాదులు అందుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Read: బుమ్రాతో ఆ పాక్ బౌలర్ ను పోల్చడం అవివేకం…

Exit mobile version