దేశంలో మొదటిసారి మహిళలు పురుషులను బీట్ చేశారు. సర్వే ప్రకారం 2015-2016లో స్త్రీపురుష నిష్పత్తి 919 -1000 గా ఉంటే, 2019-2020లో 929-1000కి చేరింది. అయితే తాజా సర్వే ప్రకారం మొదటిసారి పురుషుల సంఖ్యకంటే మహిళల సంఖ్య పెరిగినట్టు తేలింది. స్త్రీలు 1020 ఉండగా, పురుషుల సంఖ్య 1000 ఉన్నట్టు సర్వేలో తేలింది. అయితే 2005-06లో స్త్రీపురుష నిష్పత్తి 1000-1000 సమానంగా ఉండగా, ఆ తరువాత జరిగిన పరిణామాల కారణంగా మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది.
Read: ‘అఖండ’ ఈవెంట్ కి గెస్ట్ గా బన్నీ.. తెర వెనుక ఉన్నది ఎవరు..?
ఈ ఏడాది నిర్వహించిన తాజా సర్వే ప్రకారం స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకంటే అధికంగా ఉన్నట్టు తేలింది. నవంబర్ 24 వ తేదీన ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదికను విడుదల చేసింది భారత ఆరోగ్యశాఖ. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం సర్వేను నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. 2015-16లో బర్త్ రేట్ 78.9శాతం ఉండగా, 2019-21లో బర్త్రేట్ 88.6 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.