Site icon NTV Telugu

ఏపీకి కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మను నియమించారు.. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ పదవీ కాలం ఈ నెలతో ముగియనుండడంతో.. దీంతో.. కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈనెల 30న ఆదిత్యానాథ్ దాస్‌ పదవీ విరమణ చేయనుండగా.. అక్టోబర్‌ 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు సమీర్‌ శర్మ.. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు సమీర్ శర్మ.. ఆదిత్యనాథ్ దాస్‌ పదవీ విరమణ విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి పలువురు పేర్లను పరిశీలించిన ప్రభుత్వం.. చివరకు సమీర్‌ శర్మ నియమానికి మొగ్గు చూపింది.

Exit mobile version