శ్రీశైలం డ్యామ్ ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తీసేందుఉ సర్వే మొదలు పెట్టారు.. డ్యామ్‌లో పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే చేస్తోంది ముంబైకి చెందిన 12 మంది నిపుణుల బృందం.. శ్రీశైలం డ్యామ్‌లో బోటుపై ప్రయాణిస్తున్న ఈ టీమ్.. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక పరిమాణం ఏ స్థాయిలో ఉంది.. తీస్తే ఎంత మేర పూడిక తీయాల్సి ఉంటుంది అనే విషయాలపై లెక్కలు వేస్తోంది సర్వే బృందం.. కాగా, 308.62 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చేపట్టారు.. అయితే, డ్యామ్‌లో పూడిక పేరుకుపోయి 265 టీఎంసీలకు పడిపోయింది నీటి నిలువ సామర్థ్యం.. ఇక, 2009 వరదల తర్వాత మరింత పూడిక పేరుకుపోయిందని చెబుతున్నారు అధికారులు.. దీంతో.. శ్రీశైలం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు పడిపోయింది. ఇక, తాజాగా హైడ్రో గ్రాఫిక్ సర్వే తో పూడికను నిర్ధారించనుంది ముంబై టీమ్.. మొత్తంగా 15 రోజుల పాటు ఈ సర్వే కొనసాగనున్నట్టుగా చెబుతున్నారు.
శ్రీశైలం డ్యామ్.. పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే
