Site icon NTV Telugu

పబ్బుల్లో గబ్బు పనులు చేస్తే ఖబడ్దార్..సీపీ వార్నింగ్

ఈమధ్యకాలంలో పబ్బులు చట్టవ్యతిరేక చర్యలకు, గబ్బు పనులకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ వార్నింగ్ ఇచ్చారు. పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కొన్ని పబ్ ల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. పబ్ ల మీద ఫిర్యాదులు వస్తే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు సీపీ.

పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పబ్ లు సకాలంలో మూసి వేస్తున్నారా లేదా అనే దానిపైన టాస్క్ ఫోర్స్ పని చేస్తుందన్నారు. పబ్బుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారని, ఎలాంటి అతిక్రమణలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తాగి వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో నడపవద్దన్నారు. పిల్లలకు వాహనాలను నడిపేందుకు తల్లిదండ్రులు ఇవ్వకూడదని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు.

Exit mobile version