ప్రపంచంలో అతిపెద్ద కార్ల సంస్థగా ప్రసిద్ధి చెందిన టెస్లా కంపెనీకి చైనా దిగ్గజం హువావే షాక్ ఇచ్చింది. హువావే ఐటో ఎం 5 అనే కారును రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. హైబ్రీడ్ కారు కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎలక్ట్రిక్‌తోనూ, పెట్రోల్ తోనూ నడుస్తుంది. ఒకసారీ ఈ కారు బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. అంతేకాదు, హైబ్రీడ్ కారు కావడంతో స్టీరింగ్ జీరో అయినప్పటికీ ప్రయాణం చేయగలదు. టెస్లా వై మోడల్ ధర కంటే తక్కువ ధరకే ఈ ఐటోఎం5 విపణిలో లభించనుంది. ఫిబ్రవరి 20, 2022 న ఈ కారును విపణిలోకి ప్రవేశపెట్టబోతున్నారు.
Read: రాములమ్మ ఫైర్.. కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో..!
టెస్లా కారును తలదన్నేలా ఉండటంతో కార్ల ప్రియులు ఈ కారు కోసం ఎదురు చూస్తున్నారు. డబుల్ లేయర్డ్ సౌండ్ ప్రూఫ్ గ్లాస్‌ను కలిగి, సిస్టమ్ హార్మోని ఓఎస్ సిస్టమ్ తో పనిచేస్తుందని హువావే కంపెనీ తెలియజేసింది. టెస్లా వై మోడల్ ధర రూ. 33,07,877 ఉంటే, హువావే ఐటో ఎం 5 కారు ధర రూ. 29,45,915గా ఉంది. ఐటో ఎం 5 మోడల్ కారు 200 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని వినియోగిస్తారు. అయితే, హువావే కంపెనీపై అమెరికాలో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.
