Site icon NTV Telugu

హోటల్‌లో టిప్పు విషయంలో గొడవ.. యువకులపై దాడి..

నచ్చిన హోటల్‌కి వెళ్లి.. మెచ్చిన ఫుడ్‌ తిన్న తర్వాత.. సంతృప్తి చెందితే.. ఎవరైనా అక్కడి వెయిటర్‌కి టిప్పుగా కొంత డబ్బు ఇస్తుంటారు.. హోటల్‌, రెస్టారెంట్‌ రేంజ్‌ని బట్టి టిప్పు పెరిగిపోతుంటుంది.. కొందరు ఇవ్వకుండా వెళ్లిపోయేవారు కూడా లేకపోలేదు.. అయితే, టిప్పు ఇవ్వలేదని ఓ యువకుడిని వెయిటర్‌ చితకబాదిన ఘటన శంషాబాద్‌లో వెలుగు చూసింది..

Read Also: రూ.3,520 కోట్లకు చేరిన ‘కార్వీ’ మోసం.. 5 వేల పేజీలతో ఛార్జీషీట్..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌ బావార్చిలో బిర్యాని తినేందుకు వెళ్లారు స్థానికంగా ఉండే కొందరు యువకులు.. అయితే, టిప్పు విషయంలో వెయిటర్‌, యువకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది.. బిర్యాని తిన్న తర్వాత బిల్లు చెల్లించి వెళ్తున్న యువకులను నాకు టిప్పు ఇవ్వరా? అంటూ అడ్డుకున్న వెయిటర్‌.. ఆ యువకులపై దాడిచేసి చితకబాదాడు.. ఇక, వెయిటర్‌కు తోడైన హోటల్ యజమాన్యం కూడా యువకులపై దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.. గతంలో కూడా ఈ హోటల్‌పై పలు రకాల ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు.. హోటల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version