Site icon NTV Telugu

కరాచీలో హిందూ దేవాలయం ధ్వంసం..

పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. దేవాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసినందుకు ఒక వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. ఆ వ్యక్తి సాయంత్రం కరాచీలోని రాంచోర్ లైన్ ప్రాంతంలోని హిందూ దేవాలయంలోకి ప్రవేశించి హిందూ దేవత జోగ్ మాయ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. అయితే అనంతరం నిందితుడిని ప్రజలు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

స్థానిక మీడియా సమాచారం మేరకు నిందితుడిపై దైవదూషణకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనను బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ట్విట్టర్‌ వేదికగా ఖండిస్తూ.. “మైనారిటీలపై రాజ్య మద్దతుతో కూడిన ఉగ్రవాదం” అని అభివర్ణించారు. “రాంచోర్ లైన్‌లో మరో హిందూ దేవాలయాన్ని కరాచీ పాకిస్తాన్ దాడిదారులు అపవిత్రం చేశారు’ ఇది పాకిస్థాన్‌లోని మైనారిటీలపై ప్రభుత్వ మద్దతుతో కూడిన ఉగ్రవాదం’ అని సిర్సా ట్వీట్‌ చేశారు.

Exit mobile version