కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, ఆయన బృందం బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో ఈ వారంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సేతుపతి సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేయగా, హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది.
హిందూ మక్కల్ కట్చి సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విజయ్ సేతుపతి స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని అవమానించాడని తెలుపుతూ వీడియో స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. తేవర్ అయ్యను అవమానించినందుకు నటుడు విజయ్ సేతుపతిని తన్నిన వారికి హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందిన వ్యక్తి అర్జున్ సంపత్ నగదు బహుమతిని ప్రకటించారు. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు.
Read Also : మైసూర్ లో ల్యాండైన “బంగార్రాజు”
అర్జున్ సంపత్ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తాను విజయ్ సేతుపతి వైరల్ వీడియోను చూసే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చానని అంగీకరించాడు. విజయ్ సేతుపతిని తన్నడానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు మహా గాంధీ అని, విజయ్ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు మహాగాంధీ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారని, కానీ విజయ్ సేతుపతి వ్యంగ్యంగా మాట్లాడడమే వాగ్వాదానికి దారి తీసిందని అర్జున్ సంపత్ అన్నారు.
