NTV Telugu Site icon

High Court Stay on Polavaram Canal: పోలవరం కాలువ తవ్వకాలపై హైకోర్టు స్టే

High Court

High Court

High Court Stay on Polavaram Canal: పోలవరం కాలువ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే విధించింది.. పోలవరం కాలువ అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు పిల్లి సురేంద్రబాబు.. పోలవరం కాలువ తవ్వకాలతో సుమారు రూ. 850 కోట్ల విలువ చేసే గ్రావెల్ అక్రమంగా తరలించినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని పిటిషనర్‌ ఆరోపించారు.. ఇక, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. అంతేకాదు.. పోలవరం కాలువ తవ్వకాలపై స్టే విధించింది న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read Also: Satyavathi Rathod: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేస్తోంది

Show comments