Site icon NTV Telugu

రాజు ఆత్మహత్య.. న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన కలకలం సృష్టించింది.. ఇక, కేసులు నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే, నిందితుడు రాజు ఆత్మహత్యపై అనుమానాను వ్యక్తం చేస్తూ హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. రాజు ఆత్మహత్య ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వరీకి ఆదేశించింది… దీనికి వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ను జుడిషియల్ అధికారిగా నియమించింది తెలంగాణ హైకోర్టు.. నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

కాగా, సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు.. నిన్న వరంగల్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించింది పౌరహక్కుల సంఘం. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వాదనలు వినిపించారు పిటిషనర్‌.. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌.. కోర్టుకు తెలిపారు.. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగిందని ఏజీ నివేదిక అందజేశారు.. అయితే, వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోగా వరంగల్‌ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version