ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర హైకోర్టు.. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మరోసారి ఈ కేసులో విచారణ చేపట్టింది ధర్మాసనం.. ఇక, టికెట్ల ధరల నియంత్రణపై జీవో నంబర్ 35 రద్దు అందరికీ వర్తిస్తుందన్నారు అడిషనల్ జనరల్.. కాగా, గత విచారణలో పిటిషనర్లకే జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపిన సంగతి విదితమే.. అయితే, ధరల పెంపుపై ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్లకు పంపాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. వివరాలను అడిషనల్ అఫిడవిట్‌లో దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: లోక్‌సభ ముందుకు ఓటరు కార్డు-ఆధార్ లింక్ బిల్లు.. విపక్షాల రియాక్షన్ ఇది..
