NTV Telugu Site icon

మావోయిస్టుల వారోత్సవాలు.. ఏజెన్సీ లో హై ఆలర్ట్

రేపటి నుండి ఈ నెల 8 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన చర్ల మండలం చెన్నాపురంలో పర్యటించిన అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపెందుకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మావోయిస్టుల వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలని, సరిహద్దు ప్రాంతాలలో అనుమానితులను, మావోయిస్టు కార్యకలాపాలు కు చెక్ పెట్టేందుకు డీజీపీ పలు సూచనలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అంధ్రా సరిహద్దులలో నిఘా పెంచాలని ఆదేశించారు.
ఇప్పటికీ ఏజెన్సీలోకి ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ప్రజాప్రతినిధులు అనుమతులు లేకుండా పర్యటించోద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.