NTV Telugu Site icon

అమెజాన్ డెలివ‌రి విమెన్‌కు క‌స్ట‌మ‌ర్ ఫ‌న్నీ టాస్క్‌..నెట్టింట వైర‌ల్‌…

అమెరికాలోని ఒక్ల‌హామా రాష్ట్రానికి చెందిన ఓ మ‌హిళ అమెజాన్‌లో ఓ వ‌స్తువును కొనుగోలు చేసింది.  అమెజాన్‌లో కొనుగోలు చేసిన వ‌స్తువును డోర్ డెలివ‌రీ చేసేందుకు డెలివ‌రీ విమెన్ ఇంటికి వ‌చ్చింది. ఈ లోగా క‌స్ట‌మ‌ర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వ‌చ్చింది.  భ‌ర్త‌కు తెలియ‌కుండా ప్యాకేజీని దాచిపెట్టాల‌ని మెసేజ్ వ‌చ్చింది.  మొద‌ట ఇంటి గుమ్మం ముందు పార్శిల్‌ను ఉంచింది. ఆ త‌రువాత అక్క‌డి నుంచి తీసి దానిని ఇంటి బ‌య‌ట ఉన్న చెట్టుపొద‌ల్లో దాచింది.  దానిని ఫొటోగా తీసుకొని వెళ్లిపోయింది.  

Read: అది గోల్డెన్ ఐలాండ్‌… ఆ దీవిలోకి అడుగుపెడితే…

ఈ దృశ్యాల‌న్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.  అమెరిక‌న్ టిక్‌టాక్ యూజ‌ర్ ఆ దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  10 సెకన్ల‌ ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  క‌స్ట‌మ‌ర్ టాస్క్‌ను అమెజాన్ డెలివ‌రీ విమెన్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా గుర్తించిందని టిక్‌టాక్ యూజ‌ర్ తెలిపారు.