NTV Telugu Site icon

చెన్నైలో భారీ ఎర్రచందనం డంప్ సీజ్

ఎర్రచందనం అక్రమార్కులకు బంగారంగా మారింది. ఏపీతో సహా కర్నాటక, తమిళనాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా సాగిపోతోంది. చెన్నైలో భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రెడ్ హిల్స్ లోని ఓ పాత సామాన్లు గోడౌన్ లో దాచిపెట్టిన సుమారు రెండు కోట్లు విలువచేసే 179 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుంది రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోంది. పుష్ప సినిమా తామింకా చూడలేదని, సినిమాలో పాల వ్యాను,ఇతర మార్గంలో అక్రమ రవాణా చేస్తున్న తరాహాలోనే ఇప్పుడు పాత సామాన్లు గోడౌన్ లో ఎర్రచందనం దాచారని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పుష్ప సినిమాను వేలూరు సమీపంలోని సినిమా హాల్లో ప్రత్యేక షో వేసుకున్నారనే సమాచారం తమకు రాలేదన్నారు. రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందరరావు నాయకత్వంలో దాడులు జరిగాయి,