గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం వ్యవసాయానికి మంచిదే. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణ, నగరాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సిరిసిల్లలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లొతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి పండుగ కోసం ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి అంటే అక్కడ వర్షం ఏ స్థాయిలో కురుస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇక సిరిసిల్ల పట్టణం సమీపంలో ఉన్న బోనాల చేరువుకు భారీగా వరదనీరు చేరడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. ఏ క్షణంలో కట్ట తెగిపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read: ఇండియా కరోనా అప్డేట్: భారీగా తగ్గిన కేసులు… పెరిగిన మరణాలు