ఇండియా క‌రోనా అప్డేట్‌: భారీగా త‌గ్గిన కేసులు… పెరిగిన మ‌ర‌ణాలు

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా దేశంలో 31,222 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,30,58,843కి చేరింది.  ఇందులో 3,22,24,937 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 3,92,864 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంటల్లో ఇండియాలో మ‌హమ్మారి నుంచి 42,942 మంది కోలుకున్నారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 290 మంది క‌రోనాతో మృతి చెందారు.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,41,042కి చేరింది.  ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 69,90,62,776 మంది టీకాలు తీసుకున్నారు.  

Read: గ‌ల్ఫ్ దేశాల్లో క‌రోనా త‌గ్గుముఖం…ఆంక్ష‌లు స‌డ‌లింపు…

Related Articles

Latest Articles

-Advertisement-