NTV Telugu Site icon

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం…పొంగిపొర్లుతున్న నాలాలు…

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన గులాబ్ తుఫాన్ ప్ర‌భావం తెలంగాణ‌పై కూడా ప‌డింది.  గులాబ్ తుఫాన్ కార‌ణంగా తెలంగాణ‌లోని అనేక ప్రాంతాల్లో కుండ‌పోత‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  హైద‌రాబాద్ న‌గరంలో ఈ ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది.  జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, కూక‌ట్‌ప‌ల్లి, గ‌చ్చిబౌలీ, రాజేంద్ర‌న‌గ‌ర్‌, జీడిమెట్ల‌, కొంప‌ల్లి, కుత్భుల్లాపూర్‌, అంబ‌ర్‌పేట్ తో పాటుగా న‌గ‌రంలోని అనేక ప్రాంతాల్లో వ‌ర్షం దంచికొడుతున్న‌ది.  దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు.  లోత‌ట్టుప్రాంతంలోని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ కార‌ణంగా మూడు రోజుల పాటు విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.  భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. 

Read: అనంత‌’బంగారు’పురం…