Heavy Rains : కర్ణాటకను వణికిస్తున్న భారీ వర్షాలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటిమయం అవుతున్నాయి..కర్ణాటక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. గత 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి.. చాలా మంది తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు..దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే సమయంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు, 5.02 కిలోమీటర్ల విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతిన్నాయి.. దాంతో ఆ ప్రాంతమంతా చీకటిలోనే ఉండిపోయింది..
శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందడంతో జంట తీర జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడిపిలో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకా నందవర గ్రామంలో కొండ భాగం కూలి 47 ఏళ్ల మహిళ మృతి చెందింది. శిథిలాల నుంచి ఆమె 20 ఏళ్ల కుమార్తెను రక్షించారు. ఉడిపి జిల్లాలో గురువారం రాత్రి కర్కల-పడుబిద్రి రాష్ట్ర రహదారిపై బెల్మన్ పట్టణం గుండా వెళ్తుండగా భారీ చెట్టు వాహనంపై పడటంతో బైక్ రైడర్ ప్రాణాలు కోల్పోయాడు.. ఇలా ఒక్కొక్కరు ప్రాణాలను కోల్పోతున్నారు.. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరిందనీ, దక్షిణ కన్నడలో ఐదుగురు, ఉడిపిలో ముగ్గురు మరణించారని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మరో ఘటనలో ఉడిపి సమీపంలోని కలియన్ పుర-సంతెకట్టె జంక్షన్ వద్ద 66వ నెంబరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న అండర్ పాస్ లో కొంత భాగం బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కూలిపోయింది… ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు..అలాగే క్యారేజ్ వే ద్వారా వాహనాలను అనుమతిస్తున్నప్పటికీ అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, కొండకు వెళ్లే మార్గం జారిపోవడంతో దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా గడై కల్లులో శుక్రవారం నుంచి ట్రెక్కింగ్ ను అటవీశాఖ నిషేధించింది.. పూర్తిగా వర్షాలు తగ్గాకే మళ్లీ అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు..
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!