గత నెల రోజుల క్రితం చైనాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో వర్షాలు కురవలేదని చైనా అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై నడుం లోతుల్లో నీళ్లు రావడంతో పాటుగా అటు షాపింగ్ మాల్స్, సెల్లార్లు, బస్సులు, రైళ్లు అన్నీ కూడా నీటిలో సగం వరకు మునిగిపోయిన దృశ్యాలను చూశాం. ఆ పరిస్థితి నుంచి బయటపడేసరికి చైనాకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. కాగా, ఇప్పుడు అమెరికాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో భీకరమైన గాలులతో కూడిని భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సెల్లార్లలతోకి నీరు చేరడంతో బయటకు రాలేకపోతున్నారు. అదే విధంగా, కార్లు సగానికి పైగా నీట మునిగాయి. రైళ్లు, బస్సుల్లోకి కూడా నీరు చేరడంతో న్యూయార్క్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
Read: కోవాక్స్‌కు నో చెప్పిన ఉత్తర కొరియా… కరోనా కట్టడికి కిమ్ సొంత మార్గం…
