కోవాక్స్‌కు నో చెప్పిన ఉత్త‌ర కొరియా… క‌రోనా క‌ట్ట‌డికి కిమ్ సొంత మార్గం…

ప్ర‌పంచంలో మ‌హ‌మ్మారి కేసులు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.  క‌రోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం.  వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ కోవాక్స్ పేరుతో ఓ సంస్థ‌ను ఏర్పాటు చేసింది.  ఈ సంస్ ద్వారా ప్ర‌పంచంలోకి పేద, మ‌ద్య‌త‌ర‌గ‌తి దేశాల‌కు వ్యాక్సిన్‌ల‌ను అందిస్తోంది.  అయితే, కోవాక్స్‌లో భాగంగా ఉత్త‌ర కొరియాకు 30 మిలియన్ డోసుల సీనోవ్యాక్ డోసులు అందించేందుకు కోవాక్స్ ముందుకు రాగా, దానిని ఉత్త‌ర కొరియా తిరస్క‌రించింది.  త‌మ‌కు ఆ వ్యాక్సిన్ డోసులు అవ‌స‌రం లేద‌ని, త‌మ సొంత మార్గం ద్వారానే క‌రోనాను క‌ట్ట‌డి చేస్తామ‌ని ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ పేర్కొన్నారు.  ప్ర‌పంచం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారితో భ‌య‌ప‌డుతుంటే, ఉత్తర కొరియా మాత్రం త‌మ దేశంలో క‌రోనా కేసులు లేవ‌ని మ‌రోసారి స్ఫ‌ష్టం చేసింది.  ఆ దేశంలో క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  చాలా కాలంగా స‌రిహ‌ద్దుల‌ను మూసివేశారు.  ఉత్త‌ర కొరియాను సంద‌ర్శించేందుకు వ‌చ్చే టూరిస్టుల‌పై కూడా క‌ఠిన నింబంధ‌న‌లు విధిస్తున్నారు.  క‌ఠిన‌మైన ఆంక్ష‌ల దృష్ట్యా ఆ దేశం తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఆహ‌రం కొర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు.  అయిన‌ప్ప‌టికీ కిమ్ మాత్రం నిబంధ‌న‌ల విష‌యంలో క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. 

Read: తాలిబ‌న్ల‌కు పంజ్‌షీర్ టెర్ర‌ర్‌….అల్‌ఖైదా సాయం…

Related Articles

Latest Articles

-Advertisement-