ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంపై భారీవర్షాలు తీరని భారం మోపాయి. భారీ వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల్లో తీరని నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది.
కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో 4, అనంత, నెల్లూరుల్లో చెరొకరు గల్లంతైనట్టు వెల్లడించింది. మొత్తంగా 1316 గ్రామాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా అపార నష్టం సంభవించింది. 2.33 లక్షల హెక్టార్లల్లో పంట నష్టం కలిగింది. 19,645 హెక్టార్లల్లో ఉద్యాన పంటలకు వాటిల్లింది నష్టం. రూ. 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం. పౌల్ట్రీ రంగానికి రూ. 2.31 కోట్ల మేర నష్టం. మొత్తం 2403 జీవాలు మృతి చెందాయి. మరికొన్ని వివరాలు అందాల్సి వుంది.
