NTV Telugu Site icon

వేడి వేడి వెల్లుల్లి టీ తో ఆరోగ్యం అదుర్స్‌..

మంచుకురిసే వేళలో.. ఉదయాన్నే ఓ కప్పు టీయో, కాఫీయో తాగితే ఆ అనుభూతి గురించి టీ, కాఫీ తాగేవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉదయం మనం తాగే టీ, కాఫీ కంటే వెల్లుల్లి టీ ఎంతో బెస్ట్‌ అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు ఒక్క కప్పు వెల్లుల్లి టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెల్లుల్లిని మనం రోజు వంటలో ఉపయోగిస్తుంటాం.

వెల్లుల్లి.. వంటకే ప్రత్యేక రుచిని తెస్తుంది. అలాగే వెల్లుల్లి టీ కూడా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని తెలుపుతున్నారు. ఓ కప్పు నీటిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఓ గ్లాసులోకి వడకట్టి ఆ నీటిని తీసుకొని కొంచె తేనే లేకుంటే నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా చేస్తే రక్తంలో ఉన్న చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తుంది.

జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. వెల్లుల్లి రోగ నిరోధకశక్తిని పెంచడంతో సహాయం పడుతుంది. కాబట్టి జ్వరం, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడలాంటివి దరిచేరని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఓ కప్పు వెల్లుల్లి టీని తాగి మీ ఆరోగ్యం అదుర్స్‌ అనిపించుకొండి.