Site icon NTV Telugu

Health Tips : గర్భిణీలు చికెన్ ఎలా తినాలో తెలుసా?

Pragnancy Womens Food

Pragnancy Womens Food

తల్లి అవ్వడం దేవుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం.. మరో జీవికి జన్మను ఇస్తున్నాం.. అందుకే మనం తీసుకొనే ఆహరం నుంచి వేసుకొనే బట్టల వరకు అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.. ఏవి పడితే అవి తినడం మానెయ్యాలి..ప్రెగ్నెన్సీ టైమ్‌లో శరీర మార్పులు రావడం కూడా ఆహారపు అలవాట్ల కారణంగానే ఉంటాయి. అందుకే, ప్రెగ్నెంట్స్ వారు తీసుకునే ఆహారం తనతో పాటు కడుపులో పెరిగే పిండానికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇక చికెన్ ను తినొచ్చా లేదా అన్న సందేహాలు చాలా మందిలో మెదులుతూ ఉంటాయి.. ఈరోజు మనం ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

సాధారణంగా చికెన్‌లో లిస్టెరియా అనే బ్యాక్టీరియాతో కులుషితమవుతుంది. దీనిని ఎక్కువగా ఉడికిస్తే ఆ బ్యాక్టీరియా నాశనమవుతుంది. కాబట్టి, ఎక్కువగా ఉడికించి తినాలి..చికెన్ లీన్ ప్రోటీన్. ఇది ఇతర ముఖ్య విటమిన్స్, ఖనిజాలతో నిండి ఉంటుంది. గర్భం ప్రారంభంలో తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి.. ఇక చికెన్ లో నియాసిన్ లేదా విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ హెల్దీగా ఉండేలా చేస్తుంది.. అందుకే వారానికి ఒకసారి మసాలాలు తక్కువగా వేసుకొని తింటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు..

ఇకపోతే చికెన్‌లోని తొమ్మిది ముఖ్య ఆమ్లాలు కండరాలను నిర్మించి, బలంగా చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇది ముఖ్య పోషకాలను అందించి వ్యర్థ కొవ్వుని దూరం చేస్తుంది. కొవ్వు పెరగకుండా ఉండాలంటే స్కిన్ లేకుండా తినాలి…చికెన్ లివర్‌లో ఫోలేట్ ఉంటుంది. ఇది పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ లోపాలను దూరం చేస్తుంది… పోలీక్ యాసిడ్స్, ఒమేగా 3,6 లు కూడా ఉన్నాయి.. అదే విధంగా బేబీ పోషణకు కావలసిన పోషకాలు, విటమిన్స్ చికెన్ లో పుష్కలంగా ఉన్నాయి..బెనిఫిట్స్ మాత్రమే కాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..రోజుకి 100 గ్రాముల చికెన్ తింటే రోజువారీ ప్రోటీన్ 50 శాతం అందుతుంది. ఇందులో ఎలాంటి హానికర పదార్థం ఉండదు. కోడి మాంసం ప్రమాదాలలో ఒకటి లిస్టెరియా, ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి కలుషిత చికెన్‌లో ఉంటాయి.. అందుకే ఎక్కువగా తీసుకోకూడదు.. ఎక్కువగా ఉడికించి తినాలి.. ఇది గుర్తుంచుకొని తినండి.. లేకుంటే చాలా ప్రమాదం..

Exit mobile version